అరుదైన సీన్.. హైదరాబాద్‌లో మాయమైన నీడలు!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో శనివారం ఖగోళ అద్భుతం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో మధ్యాహ్నం సరిగ్గా 12:12 గంటలకు సూర్యుడు నడినెత్తిపైకి రావడంతో, వస్తువుల నీడలు మాయమయ్యే ‘జీరో షాడో డే’ (Zero Shadow Day Hyderabad) సంభవించింది. సూర్యకిరణాలు నిలువుగా పడటం వల్ల నిమిషం పాటు నీడలు కనిపించకుండా పోయాయి. హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో సైంటిస్టులు వివిధ పద్ధతుల్లో ఈ జీరో షాడో డేను ప్రత్యక్ష అనుభవంలోకి తెచ్చారు. పలు విద్యా సంస్థలు కూడా ఏర్పాట్లు చేయడంతో ఆయా విద్యార్థులు ఈ ఖగోళ అద్భుతాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారు.

జీరో షాడో డే అంటే ఇదే..

భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీల వంపుతో తిరగడం వల్ల, సూర్యుడు ఉత్తరాయణం మరియు దక్షిణాయనం మధ్య కదులుతున్నట్లు కనిపిస్తాడు. ఈ క్రమంలో ఉత్తర అక్షాంశం 23.5 మరియు దక్షిణ అక్షాంశం మధ్య ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ జీరో షాడో డే సంభవిస్తుంది. ఈ సమయంలో నిటారుగా ఉన్న ఏ వస్తువు నీడ కూడా పక్కకు పడదు. ఇది భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాలలో, అంటే కర్కట రేఖ, మకర రేఖల మధ్య ఉండే నగరాల్లోనే కనిపిస్తుంది. హైదరాబాద్ భౌగోళికంగా ఈ పరిధిలోనే ఉండటం వల్ల మనకు ఈ అవకాశం కలిగింది.

మళ్లీ ఎప్పుడు చూడవచ్చు?

భూమి తన అక్షంపై వంగి ఉండటం వల్ల ఏటా రెండుసార్లు ఈ వింత జరుగుతుంది. మే నెలలో సంభవించిన ఈ అద్బుతం మళ్లీ ఆగస్టు నెలలో కనువిందు చేస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 గంటల మధ్య కొన్ని నిమిషాల పాటు నీడ కనిపించకుండా పోతుంది. హైదరాబాద్ వాసులు ఈ ఖగోళ అద్భుతాన్ని అనుభవించాలంటే మళ్లీ ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిందే.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>