కలం, వెబ్ డెస్క్ : విజయ్-రష్మిక (Vijay – Rashmika) జంట ఓ చిన్నారి కోరికను తీర్చింది. విరోష్ వెడ్డింగ్ సమయంలో ఓ చిన్నారి తనను పెళ్లికి పిలవలేదంటూ ఓ క్యూట్ వీడియో చేసింది. ‘విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లియింది కదా. మమ్మల్ని కూడా పిలవొచ్చు కదా పెళ్లికి. మనం కూడా ఫ్యాన్సే కదా. నేను కూడా ఫ్యానే కదా. అన్నదానం పెడుతన్నారు, లడ్డూలు పెడుతున్నారు. ఈ వీడియో వాళ్లకు షేర్ చేయండి. మనల్ని పిలిస్తే ఏం అవుతుంది’ అంటూ వీడియోలో చెప్పింది.
ఆ చిన్నారి వీడియోకు విజయ్ దేవరకొండ స్వయంగా రిప్లై ఇచ్చాడు. త్వరలోనే ఇంటికి భోజనానికి పిలుస్తానని మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా ఆ చిన్నారిని విరోష్ (Vijay – Rashmika) జంట తమ ఇంటికి పిలిచి లడ్డూలు, పులిహోరతో పాటు అన్ని రకాల వంటలు చేసి పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా విరోష్ జంట పంచుకుంది. ఆ చిన్నారిని విజయ్ ఎత్తుకుని.. ఇవన్నీ తిన్నావు కదా.. ఇప్పుడు మనం కూడా ఫ్రెండ్సే కదా అంటూ అడగ్గా.. అవును అంటూ ఆ చిన్నారి సమాధానం ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Read Also: ఆరు గ్యారంటీలకు పాడె కట్టారు.. బండి సంజయ్ ఫైర్
Follow Us On: X(Twitter)

