అభివృద్ధి బాటలో కృష్ణాపురం.. ‘ఆదర్శ గ్రామం’గా ఎంపిక!

కలం, మధిర రూరల్ : అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ తదితర కార్యక్రమాల్లో ప్రగతి సాధించిన ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురం గ్రామం (Krishnapuram Village) కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గుర్తింపును సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం ఏజెఏవై పథకం కింద కృష్ణాపురం గ్రామం ‘ఆదర్శ గ్రామ పంచాయతీ’గా ఎంపికైంది.

ఈ ​గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై మాజీ సర్పంచ్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు హర్షం వ్యక్తం చేశారు. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా గ్రామంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులోనూ అందరి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ కొత్తపల్లి నరసింహారావు, వి.బి.జి. రాము, పంచాయతీ సిబ్బంది విజయ్‌కుమార్, ముత్తయ్య, ప్రసాదరావు, నరేష్, నరసింహారావు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>