దోమకొండలో నవజాత శిశువు.. శిశు సంక్షేమ శాఖకు అప్పగింత

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. దోమకొండ (Domakonda) శివారులోని ఎల్పుగొండ రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును (Newborn Baby Girl) వదిలి వెళ్ళిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు శిశువును అక్కడ వదిలేసి వెళ్లడంతో రోడ్డుపై వెళ్తున్న స్థానికులు గమనించి దోమకొండ పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చెట్ల పొదల్లో ఏడుస్తున్న చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యంగానే ఉందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. గ్రామ సర్పంచి అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దోమకొండ ఎస్సై ప్రభాకర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>