Mobile Popup Ad
Mobile Popup Ad

గ్యాస్ బుకింగ్ తిప్పలు.. మహిళల్లో అనిశ్చితి

కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో గ్యాస్ కొరత పై వస్తున్న పుకార్లు చూసి సాధారణ గృహిణులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క అధికారులు గ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులపై ప్రజల్లో నమ్మకం కుదరక పోవడంతో మహిళల్లో భయం రెట్టింపు అవుతోంది. దీనికి తోడు కొంతమంది డీలర్లు గృహ వినియోగదారులకు ఇవ్వకుండా అక్రమంగా అమ్ముకుంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.

‘బుకింగ్ రద్దైందా? ఈకేవైసీ కావడం లేదా? గోడౌన్ దగ్గర పెద్ద లైన్ ఉందటగా! మేము నాలుగు రోజుల నుంచి ట్రై చేస్తే ఇవ్వాళ బుక్కయ్యింది. మాకైతే వారం రోజుల నుంచి బుకింగ్ నెంబర్ కలవడం లేదు. మమ్మల్ని డీలర్ రోజు రేపు ఇస్తామని తిప్పించుకుంటున్నాడు’.. అనే మాటలు వీధుల్లో అరుగుల మీద, టీ షాపు ల దగ్గర, సూపర్ మార్కెట్ల దగ్గర ఎక్కడ నలుగురు కలిసినా ఇవే మాటలు చర్చకు వస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజల్లో ఒకరకమైన అనిశ్చితి నెలకొంది.

నిజానికి ఈ సమస్యలు గతంలో కూడా ఉన్నాయి. కానీ, అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. విచిత్రమేమిటంటే, అదే సోషల్ మీడియాలో గ్యాస్ కొరత (LPG Shortage) లేదనే ప్రకటనలు కూడా వస్తున్నప్పటికీ ప్రజలు పుకార్లనే నమ్ముతుండటం గమనార్హం.

సమన్వయ లోపమే సమస్యకు మూలకారణం అని కొంతమంది వినియోగదారులు చెప్తున్నారు. డీలర్లు, అధికారులు ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం వల్లనే అపోహలు పెరుగుతున్నాయంటున్నారు. ఎప్పటికప్పుడు గ్యాస్ సరఫరా వ్యవస్థను అధికారులు పర్యవేక్షిస్తూ, ఉత్పన్నమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తే ఈ పుకార్లకు అడ్డుకట్ట వేసే వీలుంటుందని బాధితులు చెప్తున్నారు.

అలాగే ప్రజల్లో నెలకొన్న భయాలను తగ్గించాలంటే అధికారులు నేరుగా జోక్యం చేసుకోవాలి.ఆధార్ లింక్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. బుక్ చేసిన వెంటనే సిలిండర్ ఇంటికి డెలివరీ ఇవ్వడం లాంటి చర్యలు చేపడితే వినియోగదారుల్లో భయాన్ని తగ్గించొచ్చు.అలాగే అక్రమంగా గ్యాస్ అమ్ముకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలి. కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించే వారి పై పిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయాలి. వీటితో పాటు స్పష్టమైన సమాచారం, సమర్థవంతమైన నిర్వహణ ద్వారానే అనుమానాలు నివృత్తి అవుతాయని జిల్లా (Khammam) ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: ఓటీటీలోకి పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>