కలం, సినిమా : స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘రణబాలి’ (Ranabaali) నుంచి మరో భారీ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo) కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ది మమ్మీ’ సినిమాలో ‘ఇమ్హోటెప్’ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు రణబాలి చిత్రంలో ‘సర్ థియోడోర్ హెక్టర్’ అనే రూత్‌లెస్ పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘రణబాలి’ టీం భారతీయ సినిమాకు స్వాగతం పలికింది. ఈ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11న ‘రణబాలి’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. హాలీవుడ్ టచ్, స్టార్ కాస్ట్, పవర్‌ఫుల్ కథతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

