డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా రంగంలోకి.. మెస్సీపైనే అందరి చూపు

కలం, స్పోర్ట్స్: ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తన టైటిల్ వేటను ప్రారంభించేందుకు సిద్ధమైంది. మరోసారి కప్‌ను గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న జట్టులో అందరి చూపు లియోనెల్ మెస్సీపైనే (Lionel Messi) ఉంది. 2022 ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనా, ఈసారి కూడా ఫేవరెట్లలో ఒకటిగా టోర్నీలో అడుగుపెడుతోంది. అయితే 1962లో బ్రెజిల్ తర్వాత ఏ జట్టూ వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలవకపోవడం ఆసక్తికర అంశంగా మారింది.

ఈసారి అర్జెంటీనా జట్టులో గత ప్రపంచకప్ విజేతలైన 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఎంజో ఫెర్నాండెజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, రోడ్రిగో డి పాల్‌లతో కూడిన మిడ్‌ఫీల్డ్ జట్టుకు ప్రధాన బలం. గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్, డిఫెండర్లు క్రిస్టియన్ రొమెరో, నికోలాస్ ఒటమెండీ రక్షణ బాధ్యతలు చేపట్టనున్నారు. మెస్సీకి (Lionel Messi) ఇది చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉండటంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. ఎనిమిది బాలన్ డి’ఓర్ అవార్డులు గెలిచిన అతడు మరోసారి జట్టుకు కీలకంగా మారనున్నాడు.

అయితే జట్టులో కొందరు కీలక ఆటగాళ్లు 38 ఏళ్ల వయసు దాటడం చిన్న ఆందోళనగా కనిపిస్తోంది. దీర్ఘకాల టోర్నీలో యువ జట్ల వేగాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రూప్-జేలో అర్జెంటీనాతోపాటు ఆస్ట్రియా, అల్జీరియా, జోర్డాన్ ఉన్నాయి. కాగితంపై అర్జెంటీనా బలంగా కనిపిస్తున్నా, ప్రత్యర్థులను తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో అర్జెంటీనా ప్రపంచకప్ ప్రయాణం ప్రారంభించనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>