నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)పై బెట్టింగ్ యాప్‌ల కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌లకు సంబంధించి పలువురు సెలబ్రిటీలకు సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విజయ్ దేవరకొండను విచారిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం విజయ్ దేవరకొండ సిట్ కార్యాలయానికి హాజరై అధికారులకు వివరణ ఇచ్చారు. మూడు గంటలపాటు అధికారులు వివిధ కోణాల్లో ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం.
ప్రమోషనల్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులపై వివరణ కోరినట్టు సమాచారం. బెట్టింగ్ యాప్‌ల ద్వారా తీసుకున్న పారితోషికం, కమీషన్ల వివరాలపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తాను చట్టపరంగా నిషేధితమైన వ్యాపారసంస్థకు ప్రమోషన్ చేసినట్టు తనకు తెలియదని అధికారులకు చెప్పినట్టు సమాచారం. కాంట్రాక్టు ప్రకారం మాత్రమే వీడియోలు చేసినట్లు తెలిపినట్టు సమాచారం.
సమగ్ర దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ఇప్పటికే పలువురు ప్రముఖులను నోటీసుల ద్వారా విచారణకు పిలిపిస్తున్నారు. ఇటీవలే ఇదే కేసులో నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash Raj)కూ విచారణ నోటీసులు జారీ చేశారు. ప్రచారకార్యక్రమాల పేరుతో పలు సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసినట్లు దర్యాప్తులో తేలడంతో, ఈ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
విదేశీ సర్వర్ల ఆధారంగా నడుస్తున్న ఈ యాప్‌లు భారత చట్టాలను ఉల్లంఘిస్తూ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ సౌకర్యం కల్పిస్తున్నాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
సినీ ప్రముఖులను విచారించిన తర్వాత సంబంధిత యాప్‌ల నిర్వాహకులు, ప్రమోషన్ ఏజెన్సీలను కూడా సిట్ విచారించనున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్‌ల ద్వారా బ్లాక్ మనీ లావాదేవీలు జరిగాయా? ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది? అనే అంశాలపై కూడా విచారణ కొనసాగుతోంది.
Read Also: నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు
Follow Us on : Pinterest

