epaper
Monday, March 2, 2026
epaper

నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌(Bellamkonda Suresh)పై శివప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటిని ఆక్రమించే ప్రయత్నం చేశారంటూ సురేశ్‌పై చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిలిం నగర్ రోడ్డు నెంబర్–7లో నివాసం ఉంటున్న శివ ప్రసాద్ అనే వ్యక్తి.. కొంతకాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్ళాడు.

అయితే తాను లేని సమయంలో మూడు రోజుల క్రితం ఆ తాళం పగలగొట్టి, ఇంట్లో ఆస్తులు, గోడలు ధ్వంసం చేసి, ఇంటిని ఆక్రమించేందుకు సురేశ్ ప్రయత్నించారని అతడు ఆరోపించారు. తాను ఇంటికి వచ్చి ధ్వంసమైన వస్తువులను చూసి విషయం తెలుసుకొని, తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh) ఇంటికి పంపానని, కాగా బెల్లకొండ సురేశ్ తన శివ ప్రసాద్ సిబ్బందిపై అసభ్యకరంగా దూషిస్తూ దాడికి యత్నించారని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి.. సంతాపం తెలిపిన నటీనటులు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!