జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికలో గెలవడం కోసం కాంగ్రెస్ కుటిల కుట్రలు పన్నుతోందంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్ని పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ కూడా జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల, కార్యకర్తల ఆగడాలకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్నిక కుట్రలు చేసుకున్నా 13వ తేదీ వరకేనని, 14న తాను గెలిచిన తర్వాత ఒక్కొక్కరి సంగతి చెప్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏముంది? పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్లు కూర్చుంటే వాళ్లని కూర్చొనివ్వడం లేదు, పోలీసులు వారి దగ్గర టేబుల్స్, చైర్లు లాక్కొని దౌర్జన్యం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని తెలిపారు.
‘‘రాష్ట్రంలో ఉన్న ఆకు రౌడీలు అందరిని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పిలిపించారు. నా భర్త గోపినాథ్(Maganti Gopinath) ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ ఇంత దౌర్జన్యం ఎన్నడూ చూడలేదు. 13వ తేదీ వరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి, 14వ తేదీ తర్వాత నేను గెలిచాక అందరి సంగతి చెప్తాను. బీర్యానీలో డబ్బులు పెట్టి ఓటర్లకు అందిస్తున్నారు. బిర్యానీ ప్యాకెట్లను చూసి పోలీసులు కూడా వదిలేస్తున్నారు. కొన్ని పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ జరుగుతోంది. వికలాంగులకు వీల్‌చైర్స్ కూడా సరిపడా పెట్టలేదు. రజియా అనే అమ్మాయి ఇంటికి వెళ్లి దాడులు చేశారు. నన్ను కూడా నవీన్ యాదవ్ మనుషులు బెదిరించారు’’ అని Maganti Sunitha తెలిపారు.
Read Also: ఢిల్లీ పేలుడు.. పూర్తి సహకారం అందిస్తామన్న సీఆర్పీఎఫ్
Follow Us on: Youtube

