కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి (Suraiahpalli) గ్రామంలోని శ్రీలక్ష్మి పారా బాయిల్డ్ రా రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో యాక్షన్ పాడికి సంబంధించి రూ. 8.60 కోట్లు సదరు మిల్లు యజమాని ప్రభుత్వానికి బకాయి ఉన్నాడు. ఈ విషయమై విజిలెన్స్ అధికారులు బకాయి చెల్లించాలని సూచించడంతో రూ. 50 లక్షలకు చెక్కు రాసి ఇవ్వడంతో పాటు ప్రభుత్వ నిర్ణయించిన గడువులోపు బకాయి మొత్తం చెల్లిస్తానని అధికారులకు మిల్లు యజమాని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ తనిఖీలో విజిలెన్స్ డి.ఎస్.పి సీతారెడ్డి, సిఐలు అనిల్ కుమార్, వరుణ్ కుమార్, తహసిల్దార్ దినేష్ చంద్ర, సివిల్ సప్లై డిటి పోచయ్య, ఎఫ్ ఐ రాజిరెడ్డి ఉన్నారు.

