​రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GPO

​కలం, కరీంనగర్ బ్యూరో: ​రైతు వద్ద లంచం డిమాండ్ చేసి, తీసుకుంటున్న ఓ జీపీఓ (GPO)ని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ​వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ (Molangur) గ్రామానికి చెందిన జీపీఓ శ్రీనివాస్, ఒక రైతు నుంచి రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. సదరు రైతు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పథకం ప్రకారం ఉచ్చు పన్ని పట్టుకున్నారు. ​

కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, లంచం తీసుకుంటుండగా శ్రీనివాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ​అనంతరం అధికారులు ఫినాఫ్తలీన్ (కెమికల్) పరీక్షలు నిర్వహించి లంచం తీసుకున్నట్లు ధృవీకరించారు. నిందితుడి వాంగ్మూలాన్ని నమోదు చేసి, కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>