నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన బాసర

కలం, బాసర: చదువుల తల్లి కొలువైన బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో అంజనీ దేవి తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈ నెల 11న శైలపుత్రి, 12న బ్రహ్మచారిణి, 13న చంద్రఘంట, 14న కూష్మాండ, 15న స్కందమాత, 16న కాత్యాయని, 17న కాళరాత్రి, 18న మహాగౌరి, 19న సిద్ధిదాత్రి అలంకారాల్లో దర్శనమిస్తారని వెల్లడించారు.

అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఈ నెల 16న అక్షర శ్రీకర పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్‌ పాటక్‌, ప్రధానార్చకులు సంజీవ్‌ పూజారి, ఆలయ ఏఈవో గంగా శ్రీనివాస్‌, సూపరింటెండెంట్లు శివరాజ్‌, సంజీవరావు, పీఆర్వో నారాయణ పటేల్‌, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>