కలం, యాదగిరిగుట్ట: కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి దేవేశ్ దేవల్ (IAS Devesh Deval) యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న దేవేశ్ దేవల్కు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు వేదశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

