బ్రెజిల్ షాక్.. ఉరుగ్వే టికెట్ రూ.199!

క‌లం, స్పోర్ట్స్‌: బ్రెజిల్ మ్యాచ్‌లో ఖాళీ సీట్లు కనిపించాయి. దీంతో ఉరుగ్వే మ్యాచ్‌కు టికెట్ ధరలు భారీగా తగ్గాయి. కోల్‌కతాలో మంగళవారం జరిగే భారత్-ఉరుగ్వే (India vs Uruguay) ఫ్రెండ్లీ కోసం కొన్ని విభాగాల టికెట్లను ఏఐఎఫ్‌ఎఫ్ రూ.199కే అందుబాటులోకి తెచ్చింది. వివేకానంద యువ భారతి క్రీడాంగణంలోని సీ2 లెఫ్ట్, సీ2 రైట్ బ్లాకుల టికెట్లు ఇంతకుముందు రూ.1,999గా ఉన్నాయి. ఇప్పుడు వాటిని రూ.199కు తగ్గించారు. అంటే దాదాపు 90 శాతం ధర తగ్గింది. అక్టోబర్ 3న ఇదే స్టేడియంలో భారత్-బ్రెజిల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు 51,402 మంది హాజరయ్యారు.

బ్రెజిల్ జట్టులో వినిసియస్ జూనియర్, మార్కినోస్, గాబ్రియెల్ మగల్హాయెస్ వంటి స్టార్లు ఉన్నా స్టేడియం పూర్తిగా నిండలేదు. ఈ నేపథ్యంలో ఉరుగ్వే మ్యాచ్‌కు టికెట్ ధరలను తగ్గించారు. రెండు సార్లు ప్రపంచకప్ గెలిచిన ఉరుగ్వే మంగళవారం భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్‌కు ప్రస్తుత అంతర్జాతీయ విండోలో చివరి ఫ్రెండ్లీ. అదే సమయంలో గతేడాది మెస్సీ ఈవెంట్‌కు టికెట్లు కొనుగోలు చేసి, కార్యక్రమాన్ని సరిగా చూడలేకపోయిన సుమారు 22 వేల మందికి ఉచిత పాసులు ఇవ్వనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>