న్యాయవాదులపై దాడులు జరగడం శోచనీయం : లక్ష్మణ్

కలం, కరీంనగర్ : న్యాయవాదుల సంరక్షణ చట్టం వచ్చినా కూడా దాడులు జరగడం శోచనీయమని కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ విచారం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోదాసు రమేష్ అనే న్యాయవాదిపై జరిగిన దాడి సందర్బంగా సోమవారం కరీంనగర్ జిల్లా కోర్టు లో విధులు బహిష్కరించి న్యాయవాదులు నిరసన (Lawyers Protest) వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాటం చేసే క్రమంలో న్యాయవాదుల పైనే దాడులు జరిగితే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

ఇలాంటి దాడుల సంస్కృతి ఇలాగే కొనసాగితే విజ్ఞాన వంతులు న్యాయవాదులు వృత్తికి రాలేరని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై విచారణ జరిపి చట్టరిత్యా చర్యలు తీసుకోవడంతో పాటు రమేష్ పై నమోదైన కౌంటర్ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం దృష్టి సారించాలని న్యాయవాదులు కోరారు. కార్యక్రమంలో సుంకె దేవకిషన్, బెజ్జంకి శ్రీకాంత్, భూమాచారి, ఏ.రాములు, చౌడమల్ల వీరస్వామి, బి.శంకర్, మహేందర్, బి.శ్రీకాంత్, శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>