epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విడదల రజిని పార్టీ మారబోతున్నారా?

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) పార్టీ మారబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె వైసీపీలో కీలక నేత. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విధేయురాలు. అయితే రజిని అసలు పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ వార్తలు నిజమేనా? లేదంటే ఎవరైనా కావాలనే పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారా? అన్న చర్చ కూడా సాగుతోంది. చిలకలూరిపేటకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న రజినీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారి పోటీ చేసి అక్కడ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ భవిష్యత్తుపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రజినిని రేపల్లె నియోజకవర్గానికి వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే ఆమె ఈ ప్రతిపాదనను సూటిగా తిరస్కరించిందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీని వల్లే రజిని పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

విడదల రజిని(Vidadala Rajini) ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఆమె వైసీపీని వీడితే ఏ పార్టీలో చేరతారు? టీడీపీలో చేరే అవకాశాలు లేకపోవచ్చు. జనసేన, లేదంటే బీజేపీ గూటికి ఆమె చేరుకొని చాన్స్ ఉంది. మరి ఈ వార్తలు నిజమేనా? కేవలం ఊహాగానాలు మాత్రమేనా? అన్నది తేలాల్సి ఉంది. వైసీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అనంతరం అనేక మంది నేతలు పార్టీని వీడారు. కొందరు జనసేన, మరికొందరు టీడీపీలో చేరారు. ఇంకొందరు రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉండిపోయారు.

Read Also: ఢిల్లీ పేలుడు కేసు.. కశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>