epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఢిల్లీ పేలుడు కేసు.. కశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు

ఢిల్లీ పేలుడు ఘటన(Delhi Blast Case)కు సంబంధించి కాశ్మీర్‌లో ఎన్‌ఐఏ(NIA) సోదాలు చేపట్టింది. ఏక కాలంలో ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులతో కలిసి పుల్వామా, షోపియన్, కుల్గాం జిల్లాల్లోని ఎనిమిది ప్రదేశాలలో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. కీలక నిందితుడు జాసిర్ బిలాల్ వనీ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టింది. అనుమానితులను వరుసగా విచారిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నవంబర్ 10న ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు(Delhi Blast Case)లో పలువురు మరణించారు. డానిష్ అలియాస్ జాసిర్ బిలాల్‌ను ఈ పేలుడు కుట్రదారుల్లో కీలక వ్యక్తిగా గుర్తించారు అధికారులు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు అధికారులు. ఈ కుట్ర వెనక ఎవరున్నా అరెస్ట్ చేయాలన్న కసితో దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో భాగంగా ఐదుగురు డాక్టర్లను, ఉగ్రవాదులకు ఆశ్రయించిన మరో వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. మారణకాండ చేయడం కోసం ఓ వైద్యుడు రైసిన్ విషయం తయారు చేశారని అధికారులు ఈ దర్యాప్తులో కనుగొన్నారు. అతడిని కూడా అరెస్ట్ చేశారు. అతడు తయారు చేసిన విషాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగతోంది. ఈ ఘటనకు సంబంధం ఉన్న ఉగ్రవాదుల ఆచూకీ కోసం, అలాగే వారికి నిధులు అందజేసిన వ్యక్తుల ఇళ్లను కూడా ఎన్ఐఏ తనిఖీ చేస్తోంది. పేలుడు కేసు నేపథ్యాన్ని వెలికితీయడానికి కీలక ఆధారాల కోసం దర్యాప్తు అధికారులు వేగవంతంగా చర్యలు చేపట్టారు.

Read Also: ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>