దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీతో మైదానంలో తలపడటానికి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఫుట్‌బాల్ మైదానంలోకి దిగి ప్రాక్టీస్ చేస్తున్నారు. MCHRD గ్రౌండ్‌లో ఆయన ప్రాక్టీస్ కొనసాగుతోంది. డిసెంబర్ 13న మెస్సీ.. హైదరాబాద్‌లో పర్యటించనున్నాడు. ఈ క్రమంలోనే ఉప్పల్ స్టేడియం వేదికగా మెస్సీ(Messi)తో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆడనున్నారు. అందుకోసమే ఆయన ప్రాక్టీస్ షురూ చేశారు. మెస్సీతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా హైదరాబాద్ రానున్నారు. ఈ విషయాన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ వెల్లడించారు. మెస్సీతో కలిసి కోహ్లీ(Kohli), శుభ్‌మన్ గిల్(Shubman Gill) కూడా ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు.
అయితే డిసెంబర్ 13 నుంచి 15 వరకు మెస్సీ పర్యటన కొనసాగనుంది. డిసెంబర్ 13 ఉదయం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కు మెస్సీ వెళ్లనున్ానడు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌కు వస్తారు. డిసెంబర్ 14 సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియాన్ని, డిసెంబర్ 15 మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోకి అరుణ్‌జైట్లీ స్టేడియాన్ని మెస్సీ సందర్శిస్తాడు.
Read Also: విజన్ డాక్యుమెంట్‌లో 8 అంశాలు రిలీజ్ ఎప్పుడంటే..?
Follow Us On: X(Twitter)


