Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల మృతిచెందిన సభ్యులకు లోక్‌సభ సంతాపం ప్రకటించింది. వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు సభ్యులు అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఢిల్లీ పేలుడు ఘటన, కార్మిక కోడ్‌లపై చర్చించాలని కూడా విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని గమనించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) సమావేశాన్ని మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
Parliament Winter Session | ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi).. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan)కు స్వాగతం పలికారు. ‘రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. గవర్నర్‌గా పలు రాష్ట్రాల్లో సేవలు అందించారు. పార్టీ కార్యకర్తగా పనిచేసినప్పటి నుంచి ఆయనను చూస్తున్నాను. ఆయన వ్యక్తిత్వం, సహనం మనందరికీ ఆదర్శం’ అంటూ మోడీ కొనియాడారు. దేశంలో ప్రజాస్వామ్యం పరిపుష్టి చెందడానికి అందరూ కలిసిరావాలని, చర్చలు అర్థవంతంగా కొనసాగేలా ప్రయత్నించాలని సభ్యులను కోరారు. ఈ సమావేశంలో అణు ఇంధన బిల్లు-2025ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 20 రోజులపాటు జరుగుతాయి. అయితే, ఈ సారి 15 రోజులకే ముగియనున్నాయి.
Read Also: ఢిల్లీ పేలుడు కేసు.. కశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు
Follow Us On: X(Twitter)


