హైబ్రిడ్ అమిటీ మోడ్(HAM) అనేది పెద్ద స్కాం అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోడ్లు బాగు చేస్తామన్న ముసుగులో రూ.8వేల కోట్లు దోచుకోవడానికి రంగం సిద్ధమైందని, ప్రభుత్వం చెప్తున్న హ్యామ్ పెద్ద స్కాం అంటూ ఆయన విమర్శలు చేశారు. ఫేస్-1లో రూ.17000 కోట్ల కాంట్రాక్టులో రూ.8వేల కోట్లు దోచుకుంటున్నారన్నారు. దీనిని బీఆర్ఎస్ ఒక పెద్ద స్కాంగా భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. హామ్‌లో కిలోమీటర్ పనులకు అయ్యే ఖర్చును 85 శాతం పెంచారని, రూ.9వేల కోట్లతో పూర్తయ్యే పనులకు రూ.17వేల కోట్ల అంచనా వ్యయం వేశారని ఆరోపించారు. సీఆర్ఎఫ్ కింద కిలోమీటర్‌కు రూ.1.75 కోట్లు ఖర్చు అయితే హామ్ కింద కిలోమీటరుకు రూ.3.30 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన గుర్తు చేశారు.

