మద్యం దుకాణాల దరఖాస్తుల తేదీని ప్రభుత్వం పొడిగింది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో అక్టోబర్ 18కే ముగిసిన దరఖాస్తుల తేదీని అక్టోబర్ 23 వరకు పొడించారు అధికారులు. ఈ క్రమంలోనే ఈ పొడిగింపులపై మద్యం వ్యాపారులు హైకోర్టు(TG High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. అసలు ఈ పొడిగింపుకు చట్టబద్దత ఉందా అని ప్రశ్నించింది. ఇష్టారాజ్యంగా గడువులు పెంచుతామంటే కుదరదని స్పష్టం చేసింది. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.
ఈ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు(TG High Court) అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ పట్ల విచారణ జరుపుతూ ప్రభుత్వంపై హైకోర్టు న్యాయమూర్తి ఎన్.తుకారంజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధత లేకుండా గడువు పెంచడం ఏంటని, ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని, చట్ట విరుద్ధంగా గడువు పెంచితే దరఖాస్తులు రద్దు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారాయన. మరో వైపు మద్యం దుకాణాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన మరో పిటిషన్లో ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.
Read Also : ‘జనం బాట’కు అంతా రెడీ.. క్షమాపణలు చెప్పిన కవిత

