‘డూడ్’ హీరో ప్రదీప్ రంగనాథన్‌పై ఆ సినిమా నిర్మాత ఎస్కేఎన్(Producer SKN) ఆస్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రదీప్ హీరో మెటీరియల్ కాదన్నారు. తాజాగా ‘డూడ్’ మూవీ రూ.100 కోట్ల జర్నీని పునర్కరించుకుని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఈవెంట్ నిర్వహించింది. ఇందులో ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాతో ప్రదీప్(Pradeep Ranganathan).. ఎలైట్ హీరోల క్లబ్‌లో చేరాడు. వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు ఇచ్చి ఇంస్ట్రీని షేక్ చేశాడు. ప్రదీప్ జస్ట్ హీరో మెటీరియల్ కాదు. యాక్టర్, స్టార్ మెటీరియల్. ప్రదీప్ ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలి’’ అని ఆయన(Producer SKN) ఆకాంక్షించారు.
అక్టోబర్ 17న విడుదలైన ‘డూడ్(Dude)’ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. బ్లాక్‌స్టర్ సక్సెస్‌గా నిలిచింది. ఈ సినిమాతో కీర్తిశ్వరన్(Keerthiswaran) డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. తొలి రోజు నుంచి మంచి కలెక్షన్లతో రూ.200 కోట్లు కొల్లగొట్టింది.
Read Also: కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన రష్మిక

