Mobile Popup Ad
Mobile Popup Ad

సంగారెడ్డిలో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలో వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వాసవి మహా సంస్థాన్ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ అతిధి గృహం నుంచి కొత్త బస్టాండ్ కలెక్టరేట్ మీదుగా పాత బస్టాండ్ నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు, లలిత సహస్ర పారాయణం చదివారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కలెక్టరేట్ లో అధికారికంగా వాసవి మాత జయంతి వేడుకలను నిర్వహించారు.

Read Also: అజారుద్దీన్​, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ జీవో విడుదల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>