Mobile Popup Ad
Mobile Popup Ad

పైడిపల్లిలో ఆర్టీసీ కార్మికుల సంబురాలు

కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 11 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం, ఆర్టీసీ విలీన ప్రక్రియపై సానుకూల నిర్ణయం తీసుకోవడంపై హనుమకొండ (Hanamkonda) జిల్లా హసన్‌పర్తి మండలం పైడిపల్లి గ్రామంలో ఆదివారం ఆర్టీసీ కార్మికులు ఘనంగా సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం, కార్మికులకు స్వీట్లు పంచిపెట్టారు.

ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కార్మికుల బాధలను స్వయంగా విని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ముందుకు వచ్చిందని కొనియాడారు. 11 శాతం పీఆర్సీ ప్రకటించడం, యూనియన్ ఎన్నికలకు అనుమతి ఇవ్వడం ప్రజా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోందని తెలిపారు. సంబరాల అనంతరం ఎమ్మెల్యే నాగరాజు , KUDA ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. ఉచిత బస్సు సౌకర్యం, ఆర్టీసీ సేవలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

Read Also: రీల్స్ క్రేజ్ : ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు తీస్తున్న యూత్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>