Mobile Popup Ad
Mobile Popup Ad

స్టేడియాన్ని పూర్తిచేసి క్రీడాకారులకు అందిస్తాం: వాకిటి శ్రీహరి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: క్రీడాకారులు తమకు ప్రతిభ ఉన్న క్రీడలో రాణించేందుకు ప్రోత్సహించే విధంగా సకల హంగులతో క్రీడా స్టేడియం నిర్మాణం (Sports Stadium) చేపడుతామని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. మంగళవారం మక్తల్ (Makthal) పట్టణంలో రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన స్టేడియం స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రోత్సాహం లేక ఎంతోమంది క్రీడాకారులు మరుగున పడిపోతున్నారని, అలాంటి వారికి తమ ప్రభుత్వం ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు మక్తల్ పట్టణంలో స్టేడియం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తాం..

ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించి.. నిర్మాణం త్వరలో పూర్తి అయ్యేటట్లు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. మట్టిలో మాణిక్యాల లాంటి క్రీడాకారులను తయారు చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. స్టేడియాన్ని త్వరలో పూర్తిచేసి క్రీడాకారులకు అందిస్తామని ఆయన తెలిపారు. రూ. 25 కోట్లతో నూతనంగా నిర్మించబోయే స్టేడియం నిర్మాణానికి సంబంధించి అధికారులతో మంత్రి సమీక్ష చేశారు.

ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలకు సంబంధించి పలు మార్పు చేర్పులను ఆఫీసర్లకు సూచించారు. ఆధునిక హంగులతో, అన్ని వసతులతో ఈ స్టేడియం నిర్మాణం ఉండాలని మంత్రి తెలిపారు. మంత్రి వెంట మక్తల్ పట్టణ, మండల అధ్యక్షులు రవి కుమార్, గణేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్, హన్మంతు, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేష్, ఇంజినీర్ ఉపేందర్ తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>