మత్తు మాయలో పడొద్దు.. విద్యార్థులకు జడ్జి రవీందర్ కీలక హెచ్చరిక

కలం, నిర్మల్: మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్ (Ravinder) అన్నారు. శనివారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఎంజేపీ బీసీ సంక్షేమ బాలుర పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు న్యాయ సేవల చట్టం, ఉచిత న్యాయ సేవల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

అలాగే మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు (Drug Awareness), ఆరోగ్యం, భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జీవన్ కుమార్, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read : దొంగిలించిన చీరే దొంగను పట్టించింది.. చోరీ కేసులో ఊహించని మలుపు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>