కలం, వెబ్ డెస్క్ : జార్ఖండ్‌లోని బొకారో జిల్లా గోమియా బ్లాక్ పరిధిలోని బంధ్ పంచాయతీలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. నేల కింది నుంచి అకస్మాత్తుగా మంటలు (Gomia Fire) చెలరేగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
భూమిని చీల్చుకుంటూ ఎగిసిపడుతున్న మంటలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నేల లోపల సహజ వాయువు లీకేజీ కావడం లేదా బొగ్గు పొరల్లో మంటలు రేగడం వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పరిశోధనలు జరుపుతున్నారు.

