దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే.. విద్యార్థులకు MGU వీసీ బిగ్ మెసేజ్

కలం, నల్లగొండ: దేశ భవిష్యత్తు నిర్మాతలు విద్యార్థులేనని, సుశిక్షితులైన, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులే దేశ నిర్మాణానికి మార్గదర్శకులని నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ (Nalgonda MGU) వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ (Khaja Altaf Hussain) పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆవరణలో ఘనంగా నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వీసీ మాట్లాడుతూ.. తరాలు మారినా మరువలేని స్వాతంత్య్ర సంగ్రామం నిరంతరం స్ఫూర్తినిస్తుందని, మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ఆచరించడం భవిష్యత్ తరాలకు అత్యంత అవసరమన్నారు. ఉన్నత విద్యలో జవాబుదారీతనం దేశానికి దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు. కేవలం విశ్వవిద్యాలయాల సంఖ్య పెరగడమే కాకుండా, నాణ్యతా ప్రమాణాలు పెరిగినప్పుడే ప్రపంచంతో పోటీపడే మానవ వనరుల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనువర్తన విద్య ద్వారా విద్యార్థుల్లో జిజ్ఞాస పెరిగి నూతన పరిశోధనలకు బాటలు పడతాయని తెలిపారు.

ప్రపంచవ్యాప్త పోటీకి అనుగుణంగా విద్యార్థుల కోసం కొత్త సిలబస్‌ను రూపాంతరం చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే విద్యా సంవత్సరానికి గాను ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సులకు అనుమతి లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలో హాజరు శాతం పెరగడమే కాకుండా, అకాడమిక్, ఫైనాన్షియల్ ఆడిట్‌లలో మెరుగైన ఫలితాలు సాధించడం ఎంజీయూ ప్రగతికి నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనబరిచిన అర్హత కలిగిన ఎన్‌సీసీ క్యాడెట్లకు వీసీ చేతుల మీదుగా ‘బి’ సర్టిఫికెట్లను అందజేశారు.

కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ హరీష్ కుమార్, సీఓఈ డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ మద్దిలేటి, ఆచార్య అలువాలా రవి, డాక్టర్ మిర్యాల రమేష్, డాక్టర్ దోమల రమేష్, డాక్టర్ హైమావతి, డాక్టర్ జక్కా సురేష్ రెడ్డి, డాక్టర్ తిరుమల, ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ మస్చేందర్, డాక్టర్ రమావత్ మురళి, డాక్టర్ వై. శ్రీనివాస్ రెడ్డిలతో పాటు వివిధ విభాగాల అధ్యాపకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>