Mobile Popup Ad
Mobile Popup Ad

ప‌క్క రాష్ట్రాల్లో రేవంత్ ప్రచారం బీజేపీకే లాభం: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

క‌లం, వెబ్ డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డి కేర‌ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌డంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (MLA Rakesh Reddy) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ ఎక్క‌డ ప్ర‌చారం చేస్తే అక్క‌డ బీజేపీకి లాభం జ‌రుగుతుంద‌ని వ్యాఖ్యానించారు. సోమవారం రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేర‌ళ‌తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ప్ర‌చారం చేయాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. గ‌తంలో సీఎం రేవంత్ మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌చారం చేశార‌ని రాకేశ్ రెడ్డి గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ‌లో ఎన్నో హామీలు నెర‌వేర్చింద‌ని దొంగ మాట‌లు చెప్పార‌ని విమ‌ర్శించారు. రేవంత్ మాట‌ల‌పై మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు ఆరా తీశార‌ని, ఆరు గ్యారెంటీలు, బీసీ స‌బ్ ప్లాన్‌, ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌, ఉద్యోగాలు ఇచ్చారా అని తెలంగాణ ప్ర‌జ‌ల‌నే అడిగి తెలుసుకున్నార‌ని చెప్పారు. అస‌లు విష‌యం తెలిశాక బీజేపీకి ఎన్నిక‌ల్లో ప‌ట్టం క‌ట్టార‌న్నారు. సీఎం రేవంత్ సైజ్‌కు త‌గ్గ మాట‌లు మాట్లాడాల‌ని, సైజ్ త‌క్కువ మాట‌లు ఎక్కువ అంటే బాగుండ‌ద‌ని రాకేశ్ రెడ్డి (MLA Rakesh Reddy) సెటైర్లు వేశారు.

Read Also: ప్రధాని మోదీ రిమోట్ ఆయన దగ్గరే ఉంది.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>