epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పెద్దపల్లి చెక్​ డ్యామ్ ల ఘటనపై విజిలెన్స్​ విచారణ

కలం, వెబ్​ డెస్క్​ : పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో చెక్​ డ్యామ్ లు(Check Dams) కూలిపోయిన ఘటనపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి (Uttam Kumar Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యామ్​ లు  ధ్వంసం అయిన ఘటనలపై ఆరా తీసిన మంత్రి విజిలెన్స్​ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. చెక్​ డ్యామ్​ లు  కూలిపోవడానికి నాసిరకం నిర్మాణం లేదా నాణ్యత లోపం కారణాలు అని తేలితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

కావాలని ధ్వంసం చేసినట్లు తెలిసినా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విచారణను వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని విజిలెన్స్ డిపార్ట్​ మెంట్​ అధికారులను ఆదేశించారు. రైతులకు మేలు చేసే చెక్​ డ్యామ్ లను ధ్వంసం చేయాలనుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్​ డ్యామ్​ల  భద్రతపై నిఘా ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు.

Read Also: న్యూ ఇయర్ వేడుకలపై నిఘా.. నగరాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>