కలం వెబ్ డెస్క్ : ఇంకో 8 రోజుల్లో ఈ సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. కొత్త ఏడాది(New Year)కి స్వాగతం చెప్పేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో(celebrations) కొన్నిసార్లు శాంతి భద్రతల సమస్యలు, ప్రమాదాలు తలెత్తుతాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద పబ్స్‌లో చట్ట విరుద్ధంగా డ్రగ్స్ వినియోగంతో ఆందోళన నెలకొంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) పరిధిలో తరుచూ డ్రగ్స్ పట్టుబడటం చూస్తూనే ఉన్నాం. డ్రగ్స్ స్మగ్లర్లపై సైబరాబాద్ పోలీసులు గట్టి నిఘా పెడుతున్నప్పటికీ కొత్త కొత్త పద్దతుల్లో ఈ దందా కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే డ్రగ్స్ దందా చేసే వారిపై నార్కొటిక్స్ బ్యూరోతో పాటు నగర పోలీసులు నిఘా పెట్టారు. నగరాన్ని అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. అర్ధరాత్రి హైదరాబాద్ నగరం రాచకొండ పోలీసుల ఆధీనంలో ఉంటుంది. బాలాపూర్ హోటల్స్, క్రికెట్ గ్రౌండ్స్‌లో తనిఖీలు చేపట్టారు. రాత్రిపూట గేమ్స్, అనుమతి లేకుండా ఎలాంటి వేడుకలు (New Year Celebrations) నిర్వహించకూడదని నిర్వాహకులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే పలువురు హోటల్ యజమానులను హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. భద్రతా నియమాలు పాటించాలని, అనవసర కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Read Also: వైజాగ్‌లో అతిపెద్ద ట్రైబల్ ఈవెంట్.. విశేషాలివే!
Follow Us On: Sharechat


