కలం, వెబ్ డెస్క్: గిరిజనాభివృద్ధికి తోడ్పడే చారిత్రాత్మక కార్యక్రమాన్ని నిర్వహించడానికి వైజాగ్(Vizag) మరోసారి ప్రధాన కేంద్రంగా మారుతోంది. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘పెసా మహోత్సవ్(Pesa Mahotsav)’ నిర్వహించనుంది. డిసెంబర్ 23, 24 తేదీల్లో ఉత్సవాలు జరగనున్నాయి. రెండు రోజుల నేషనల్ ట్రైబల్ ఈవెంట్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు.
పెసా మహోత్సవం(Pesa Mahotsav) ప్రతి సంవత్సరం జరుగుతుంది. పంచాయతీ చట్టాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. గిరిజనులకు స్వయం పాలన, అధికారాలు, సహజ వనరుల గురించి తెలియజేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా, రోడ్లు అభివృద్ధి చేయడం లాంటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా ఆదివాసీ కళల్లో రాణించే కళాకారుల ప్రదర్శనలుంటాయి.
ఈ ఈవెంట్‌లో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు రెండు వేల మంది పాల్గొననున్నారు. వీరిలో గిరిజన ప్రతినిధులు, నాయకులు, సాంస్కృతిక కళాకారులు, క్రీడాకారులున్నారు. స్పోర్ట్స్ అథారిటీ క్యాంపస్, ఆర్కే బీచ్, ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం, కళావాణి ఆడిటోరియం లాంటి వేదికల్లో గిరిజన (Tribal) క్రీడలు, జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి.
Read Also: వారణాసి సీక్రెట్ బయటపెట్టిన ప్రియాంకా
Follow Us On: Instagram


