ఇరాన్‌కు జేడీ వాన్స్‌ వార్నింగ్.. చర్చలకు రాకుంటే పెద్ద దెబ్బే!

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియా యుద్ధం అనేక మలుపులు తిరుగుతోంది. ఒకవైపు అమెరికా చర్చలకు డెడ్‌లైన్ విధిస్తే.. మరోవైపు ఇరాన్ (Iran) సైతం తగ్గేదేలే అంటూ సవాల్ విసురుతోంది. ఈ క్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. హంగేరీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌లో అమెరికా తన ప్రాథమిక సైనిక లక్ష్యాలను ఇప్పటికే పూర్తి చేసిందని స్పష్టం చేశాడు. ఇరానీయులు చర్చల విషయంలో సహజంగానే కొంత వెనుకబడి ఉంటారని కామెంట్ చేశాడు. అయినప్పటికీ అమెరికా విధించిన గడువులోగా వారి నుండి ఖచ్చితమైన స్పందన వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపాడు.

ఒకవేళ ఇరాన్ చర్చలకు ముందుకు రాకపోతే ఆ దేశం భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. శాంతియుత పరిష్కారం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని, అయితే ఇరాన్ తన వైఖరి మార్చుకోకపోతే తదుపరి చర్యలకు వెనకాడబోమని ఆయన (JD Vance) పరోక్షంగా హెచ్చరించాడు.

Read Also: బిగ్ ఆపరేషన్.. రూ.1200 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>