Mobile Popup Ad
Mobile Popup Ad

జలపాతంలో చిక్కుకున్న ఏపీ స్టూడెంట్స్.. చివరకు ఏమైందంటే!

కలం, వెబ్ డెస్క్: ఏపీకి చెందిన ఇద్దరు కాలేజీ విద్యార్థులు కర్ణాటకలోని కొడగు జిల్లాలోని మల్లాళ్లి (Mallalli Waterfalls) జలపాతంలో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి ఆపరేషన్ సురక్షితంగా రక్షించారు. గణేష్ నాయక్ (21), సంతోష్ కుమార్ (23)గా గుర్తించారు. వీరు స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం కొడగు వెళ్లారు. అక్కడ బారికేడ్లను దాటి వారు నీటిలోకి దిగారు. అదే సమయంలో ఎగువన ఉన్న పవర్ ప్లాంట్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. ఆ ఇద్దరు యువకులు దాదాపు గంటకుపైగా నీటి మధ్యలో బండరాయిని పట్టుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో తాడులు, ఇతర ప్రత్యేక రక్షణ పరికరాలతో రంగంలోకి దిగారు. చివరకు రాయిని పట్టుకుని వేలాడుతున్న ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అక్కడే ఉన్న స్థానిక ప్రజలు, ఇతర పర్యాటకులు ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ఊపిరి బిగబట్టి చూశారు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో పర్యాటకులు నిబంధనలు ఉల్లంఘించరాదని ఈ ఘటన మరోసారి తెలియజేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>