Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్‌పై అమెరికా దాడులు: హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత!

కలం, వెబ్ డెస్క్ : హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ వరుస డ్రోన్ దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ ఈ దాడులకు పాల్పడినట్లు అమెరికా రక్షణ శాఖ ఆరోపించింది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ ప్రాంతంలో ఒక చమురు ట్యాంకర్‌తో పాటు సింగపూర్‌కు చెందిన వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడటంతో అంతర్జాతీయ నౌకాయానం ఒక్కసారిగా స్తంభించిపోయింది.

ఈ చర్యలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా సైనిక బలగాలు రెండో రోజు కూడా ఇరాన్‌లోని వ్యూహాత్మక స్థావరాలపై వైమానిక దాడులు (US Strikes Iran) నిర్వహించాయి. యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, కోస్టల్ రాడార్ వ్యవస్థలు, సైనిక పర్యవేక్షణ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని నాశనం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇచ్చినా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతోనే ఈ కఠిన ప్రతీకార చర్యలు చేపట్టాల్సి వచ్చిందని అమెరికా స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>