కుమ్మరుల కులవృత్తికి ప్రత్యేక స్థలం ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

కలం, వనపర్తి: కుమ్మరి సామాజికవర్గ అభ్యున్నతికి, వారి సంప్రదాయ కులవృత్తి పరిరక్షణకు అండగా ఉంటానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) హామీ ఇచ్చారు. బుధవారం వనపర్తి పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో కవయిత్రి మొల్లమాంబ విగ్రహ (Mollamamba Statue) ఏర్పాటుకు ఆయన భూమిపూజ (Bhoomi Pooja) చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న మొల్లమాంబ రామాయణాన్ని సరళమైన భాషలో రచించి ప్రజలకు చేరువ చేశారని కొనియాడారు.

ఆమె సాహిత్య సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. కుమ్మరి సోదరులు తమ సంప్రదాయ వృత్తిని కొనసాగించుకునేందుకు వనపర్తిలో ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కుండలు, మట్టి వస్తువుల తయారీకి అవసరమైన మట్టిని తరలించడంలో ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు. కుమ్మరి సామాజికవర్గ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి కుమ్మరి సామాజికవర్గ ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>