కలం, వెబ్ డెస్క్: మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆయనకు సపర్యలు చేసినా.. కొద్ది నిమిషాల వరకు కూడా ఆయన కళ్లు తెరవలేదు. దీంతో వాహనంలో సమీపంలోని ఇంటికి తరలించి, డాక్టర్లను పిలిపించారు. ఎయిమ్స్ వైద్యుడు సందీప్ సేథ్ ఆయనకు చికిత్స చేసినా.. ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో వెంటనే అంబులెన్సులో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన్ను కార్డియాలజీ విభాగంలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. 75 ఏళ్ల జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్యంపై ఢిల్లీ ఎయిమ్స్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
అనూహ్యంగా పదవిని వీడి..
జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) దేశానికి 14వ ఉప రాష్ట్రపతిగా 2022 ఆగస్టు 11 నుంచి 2025 జులై 21వ తేదీ వరకు పనిచేశారు. పదవీ కాలం పూర్తి కాక ముందే అనూహ్యంగా తప్పుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆరోగ్య కారణాల కారణంగానే ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో విబేధాలే కారణమని చర్చ జరిగింది. రాజీనామా అనంతరం ఢిల్లీలోనే తనకు కేటాయించిన క్వార్టర్స్‌లో ఆయన నివాసం ఉంటున్నారు. పలు సందర్భాల్లో కూడా అస్వస్థతకు గురి కాగా.. చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆసుపత్రిలో చేరారు.
Also Read : 1968లో రాజీవ్‌తో పెళ్లి.. పౌరసత్వంపై 15 ఏళ్ల నిరీక్షణ ఎందుకు? : కంగనా
Follow Us On : WhatsApp

