Mobile Popup Ad
Mobile Popup Ad

హై టెన్షన్.. డెడ్‌లైన్‌కు ముందే ఇరాన్‌పై భీకర దాడులు!

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత చేదాటుతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించినట్లుగానే గడువుకు ముందే ఇరాన్ (Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులకు (US Israel Attacks) తెగబడుతుంది. కరాజ్ నగరంలో విద్యుత్ ప్లాంట్ పై దాడి చేయగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అటు చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా క్షిపణి దాడులకు తెగబడుతోంది.

ఇరాన్ దేశంలోని బ్రిడ్డ్ లు, విద్యుత్ ప్లాంట్లు లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్య ఇరాన్ లోని కాషాన్ సిటీలో ఉన్న అబాద్ రైల్వే బ్రిడ్డిని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు పేల్చేశాయి. ఇరానీయులు రైళ్ల ప్రయాణాలకు దూరంగా ఉండాలని దాడులకు ముందే ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో ఇరాన్ ముందుగానే స్టేషన్లు, రైలు సర్వీసులను నిలిపివేసింది.

కాగా, ఫిబ్రవరి 28 నుంచి ఈ యుద్ధం జరుగుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. పలువురు కీలక నేతలు కూడా చనిపోయారు. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో చెలరేగిపోతుంది. గల్ఫ్ దేశాలు లక్ష్యంగా క్షిపణులు ప్రయోగిస్తున్న ఇరాన్.. హర్మూజ్ జలసంధిని కూడా మూసేసింది. దీని కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.

Read Also: శ్రేయాన్ష్ ప్రపంచ రికార్డు సాధించడం రాష్ట్రానికి గర్వకారణం: కొండా సురేఖ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>