కలం, వలిగొండ: పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని స్థితిలో ఉన్న ఓ బాధితుడి వద్దకు పోలీసులే వెళ్లి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఈ ఘటన వలిగొండ (Valigonda) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ఎం. తుర్కపల్లి గ్రామానికి చెందిన మర్రి చంద్రయ్య, అదే గ్రామానికి చెందిన ఉడుత నరసింహను కర్రతో కొట్టాడు. గాయపడిన అతడు స్థానిక హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ఆస్పత్రి సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా పోలీసులే బాధితుడు ఉడుత నరసింహ వద్దకు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్ఐ యుగేందర్ గౌడ్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ జాఫర్, కానిస్టేబుల్స్ అనిల్, శంకర్, మహిళ కానిస్టేబుల్ సింధు వివరాలు సేకరించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వలేనివారు తమకు సమాచారం ఇచ్చినట్లయితే బాధితుల వద్దకు వెళ్తామని చెప్పారు. ప్రజల భద్రత కోసం నిత్యం అందుబాటులో ఉంటామని భరోసా కల్పించారు.
Read Also: ‘తనను తాను ప్రేమించలేని వాడు.. ఇతరులను ప్రేమించలేరు’ ఇందులో వాస్తవం ఎంత?
Follow Us On: Instagram

