శ్రేయాన్ష్ ప్రపంచ రికార్డు సాధించడం రాష్ట్రానికి గర్వకారణం: కొండా సురేఖ

కలం, వెబ్ డెస్క్: కొండా శ్రేయాన్ష్ మురళీకృష్ణ (Shreyansh Murali Krishna) అతి చిన్న వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు. HYD-జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే & ఎంపీల కాలనీ కల్చరల్ సెంటర్‌లో రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పోటీల్లో శ్రేయాన్ష్ మురళీకృష్ణ గెలుపొందాడని తెలిపారు. ఈ సందర్భంగా శ్రేయాన్ష్ కేవలం 15 నిమిషాలు 52 సెకండ్లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్‌మేట్స్‌ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాలు 9 సెకండ్లలో 21 చెస్ బోర్డులను అమర్చి రెండు ప్రపంచ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాడని కొనియాడారు.

కేవలం రెండు సంవత్సరాల 11 నెలల వయస్సులోనే చెస్ క్రీడలో రెండు ప్రపంచ రికార్డులను సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ‘శ్రేయాన్ష్ (Shreyansh Murali Krishna) అత్యంత ఏకాగ్రతతో, ఓపికతో చెస్ పజిల్స్‌ను పరిష్కరించడం, చెస్ బోర్డులను అద్భుతంగా అమర్చి, చిన్న వయస్సులోనే ఇలాంటి అసాధారణ ప్రతిభను ప్రదర్శించడం గర్వంగా ఉంది. త్వరలో వరల్డ్ బుక్ అఫ్ లండన్ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్ లో సత్కారంతో పాటు సర్టిఫికెట్ అందుకోబోతున్న శ్రేయాన్ష్‌కు నా హృదయపూర్వక అభినందనలు’ అని మంత్రి ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు.

Read Also: ‘తనను తాను ప్రేమించలేని వాడు.. ఇతరులను ప్రేమించలేరు’ ఇందులో వాస్తవం ఎంత?

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>