కలం, వరంగల్ బ్యూరో: కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి(Kishan Reddy), కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం (Jual Oram) గురువారం మేడారం చేరుకుని సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర వారికి డోలు డప్పులతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో పూజారులు, అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి అమ్మవార్ల ఆశీర్వచనాలు, ప్రసాదం అందజేసారు.


