కలం, భువనగిరి : మత సామరస్యానికి రంజాన్ (Ramzan) పండుగ ప్రతీక అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. ఆదివారం భువనగిరి (Bhuvanagiri) పట్టణంలోని వైయస్సార్ గార్డెన్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy)తో కలిసి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యం దక్కిందని అన్నారు. మసీదులు, ఈద్గాలు, దర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రజాపాలనలో శాంతియుత వాతావరణంలో అభివృద్ధి సాగుతోందని, భవిష్యత్‌లో ఇదేరకమైన సోదరభావాన్ని కొనసాగించాలని అన్నారు. రంజాన్ పవిత్ర మాసం మత సామరస్యానికి, భక్తి భావానికి ప్రతీక అని అన్నారు. ఈ మాసంలో ఉపవాసం అత్యంత ప్రధానమని తెలిపారు. పండుగల సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప మనస్సుతో పండుగ కానుకలను అందజేస్తోందని అన్నారు. రంజాన్ మాసం అత్యంత పవిత్రమైందని, సమాజంలో ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఉంచాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

