కలం, వెబ్ డెస్క్ : మేడారం మహా జాతరకు (Medaram Jatara) కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనున్న సంగతి తెలిసిందే. మేడారం జాతరకు (Medaram Jatara) తాజాగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతో పాటు గిరిజన శాఖలు రూ.3.70 కోట్లు రిలీజ్ చేశాయి. మేడారం పరిసరాల్లో పర్యాటకాన్ని డెవలప్ మెంట్ చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.80 కోట్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడు రోజుల పాటు జరగనున్న మహాజాతరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా.. అటు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్న సంగతి తెలిసిందే.


