కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ (Union Cabinet) దేశంలో పలు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి వివరాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. “కొత్తగా ఆరు యూరియా ఉత్పత్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సుమారు రూ.54 వేల కోట్లను కేటాయించింది. పోస్టల్ ఆపరేషన్ పథకం కోసం రూ.1,141 కోట్లు కేటాయించింది. పోస్టల్ శాఖలో ఎస్టేట్స్ మేనేజ్మెంట్ పథకం కోసం రూ.1,491 కోట్లు మంజూరు చేసింది. వివిధ మౌలిక వసతుల నిర్మాణానికి రూ.19,934 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. తమిళనాడులోని కామరాజ పోర్టులో రెండో కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి రూ.4,288 కోట్లు మంజూరు చేసింది” అని కేంద్ర మంత్రి తెలిపారు.
సిల్చార్ ఎయిర్‌పోర్టు విస్తరణకు ఓకే..
అసోంలోని సిల్చార్ ఎయిర్‌పోర్టు విస్తరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుత ఎయిర్‌పోర్టు చాలా ఇరుకుగా మారిపోయిందని.. అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. రన్ వే కూడా మరింత పొడిగించేందుకు అవకాశం లేకపోవడంతో.. అదే ప్రాంతంలో మరో చోట గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు అంగీకరించింది. కాచర్ జిల్లాలో డోలు ఎయిర్‌పోర్టును సెలెక్ట్ చేసి గ్రీన్ ఫీల్డ్ విధానంలో అభివృద్ధి చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న సిల్చార్ ఎయిర్‌పోర్టు మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మేఘాల రాష్ట్రాలను కనెక్ట్ చేసే అతి ముఖ్యమైన విమానాశ్రయంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Also Read : మహేశ్ ఒక్క కామెంట్.. చిన్నారి రీల్‌కు 26 మిలియన్ వ్యూస్!
Follow Us On: Youtube

