అలంపూర్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సంపత్ భవితవ్యం సందిగ్ధం!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ (Sampath Kumar) భవితవ్యం సందిగ్ధంలో పడింది. కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఏఐసీసీ కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేసిన 81 మంది కొత్త ఏఐసీసీ కార్యదర్శుల జాబితాలో సంపత్కు చోటు దక్కలేదు. దీంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆయన వర్గీయులు నిరాశలో పడిపోయారు. ఇసుక మాఫియా, కాంట్రాక్టర్ల వద్ద ఆయన కమీషన్ల వసూలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి సొంత పార్టీ నేతలే తీసుకెళ్లినట్టు చర్చలో ఉంది.

ఆయనకు ఎలాంటి అధికార పదవి లేకపోయినా కానీ.. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం చెలాయించడం, తన మాట వినకుంటే భయభ్రాంతులకు గురిచేయడం, నామినేటెడ్ పదవులను సైతం అమ్ముకున్నార ని, మున్సిపల్ ఎన్నికల్లోనూ కౌన్సిలర్ల వద్ద డబ్బులు తీసుకున్నారనే వంటి ఫిర్యాదులు ఆయనపై పార్టీ పెద్దలకు వెళ్లాయి. ఇలాంటి ఆరోపణలతోనే ఏఐసీసీ కార్యవర్గంలో సంపత్కు మరోసారి చోటు కల్పించలేదని తెలుస్తున్నది. తెలంగాణ నుంచి కొత్తగా అజ్మత్ హుస్సేన్, కోలుకొండ సతీష్‌ను ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించగా, ఒడిశా ఇన్‌ చార్జ్ జెట్టి కుసుమ కుమార్‌ను యధావిధిగా అధిష్టానం కొనసాగించింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు ద్వారా..

గత జనవరిలో అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కూడా సంపత్ పై ఆరోపణలు చేశారు. జాతీయ రహదారి-44 పనులు చేపట్టిన భ్రమరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థను సంపత్ రూ. 8 కోట్లు డిమాండ్ చేశారని, అలాగే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టును ఆయన కొడుకు సంస్థకు ఇప్పించుకున్నారని ఆరోపిస్తూ సిట్ విచారణ కోరారు. తనపై వచ్చిన ఆరోపణలను సంపత్ తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొటూ గత ఏప్రిల్లో నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ నేతలు, కొన్ని మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేశారు.

సొంత ఇలాకాలో రాజకీయంగా కోల్పోనున్న పట్టు

ఏఐసీసీలో కీలక బాధ్యతలను కోల్పోవడం సంపత్కు రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బగానే మారింది. 2014లో అలంపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన సంపత్ 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్న ఆయనకు, ఇప్పుడు జాతీయ స్థాయి పదవి పోవడంతో అలంపూర్ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం సవాలుగా మారనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>