వెల్గటూర్‌ అయ్యప్ప స్వాముల సేవలో మంత్రి అడ్లూరి

కలం, వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల (Velgatoor) కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం నుంచి నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెల్గటూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు సంక్రాంతి వరకు నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డితో పాటు శ్రీకాంత్, మురళి, పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>