మహేశ్ ఒక్క కామెంట్.. చిన్నారి రీల్‌కు 26 మిలియన్ వ్యూస్!

కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరి దశ ఎలా తిరుగుతుందో ఊహించడం కష్టం. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన ఒక్క కామెంట్ (Mahesh Babu Comment) ఓ చిన్నారిని రాత్రికి రాత్రే స్టార్‌ను చేసేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘bysweetlycurious’ అనే ఖాతాలో ఓ చిన్నారి ఎంతో ముద్దుగా పాట పాడిన రీల్ పోస్ట్ చేశారు. ఆ చిన్నారి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియో సూపర్ స్టార్ మహేశ్ బాబు కంట కూడా పడింది. వీడియో చూసి ఆయన, “హాహా.. సో క్యూట్. లాట్స్ ఆఫ్ లవ్ టు ది లిటిల్ వన్” అంటూ హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేశారు.

మహేశ్ బాబు స్పందించిన తర్వాత ఆ రీల్‌కు ఊహించని స్థాయిలో ఆదరణ లభించింది. అప్పటివరకు సాధారణంగా ఉన్న వ్యూస్ కాస్తా, ఆయన కామెంట్ దెబ్బకు ఏకంగా 26 మిలియన్లకు పైగా దూసుకెళ్లాయి. అంతేకాదు, ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 35 వేలుగా ఉన్న ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా 1.51 లక్షలకు చేరుకుంది. సూపర్ స్టార్ ఒక్క కామెంట్ ఆ చిన్నారి జీవితంలో మర్చిపోలేని సంతోషాన్ని నింపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>