Mobile Popup Ad
Mobile Popup Ad

అమెజాన్ అడవుల్లో ఆదిమ తెగ.. వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్ : ప్రపంచంలో అనేక తెగలు ఇంకా బాహ్య ప్రపంచానికి దూరంగా నివసిస్తున్నాయి. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్న ఓ ఆదిమ తెగను ఇటీవల అమెజాన్ అడవుల్లో (Amazon Tribe) గుర్తించారు. వీరికి సంబంధించిన వీడియోను ప్రముఖ ప్రకృతి సంరక్షకుడు పాల్ రోసోలీ ఓ పాడ్ కాస్ట్ లో విడుదల చేశారు. ఈ వీడియోలో కనిపిస్తున్నవారికి ఒంటిపై ఎలాంటి బట్టలు లేవు. బయటి వ్యక్తులను చూసి చెట్లు నరికేవారిలా భావించి భయపడ్డారు. తరువాత శాంతియుతంగా ఆయుధాలను వదిలేస్తారు. అనంతరం పాల్ రోసోలీ పడవలో పంపించిన పండ్లను చూసి ఆనందంగా తీసుకుంటారు. ఈ దృష్యాలను పాల్ తన కెమెరాలో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రకృతి సంరక్షకులు వారిని ఒంటరిగా వదిలేయండంటూ కామెంట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>