epaper
Monday, March 2, 2026
epaper

కేరళ సీఎం కామెంట్స్‌కు పొంగులేటి కౌంటర్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం వెలుగుమెట్ల (Velugumatla) కూల్చివేతలపై కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన విమర్శలపై మంత్రి పొంగులేటి (Minister Ponguleti) గట్టిగా సమాధానమిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరమైన నిబంధనల మేరకే వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లపుడూ పేదల పక్షాన నిలబడి, వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. ప్రభుత్వ భూములను రక్షించడం అంటే, భవిష్యత్తు తరాల కోసం ఆస్తులను కాపాడటమేనని కౌంటర్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం చేపడుతున్న ఈ చర్యలపై ఇతర పార్టీలు బుల్డోజర్ ముద్ర వేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పొంగులేటి మండిపడ్డారు.

వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూములను ల్యాండ్ (Bhoodan Lands) మాఫియా నకిలీ పత్రాలతో అమాయక ప్రజలకు విక్రయించిందని గుర్తుచేశారు. దోచుకున్న సొమ్మును తిరిగి బాధితులకు చెల్లించేలా చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం పినరయి విజయన్  (Pinarayi Vijayan) స్పందించారని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) అన్నారు.

Read Also: బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!